బీఆర్ఎస్ సోషల్ మీడియా నడిపేది కేటీఆర్: కవిత

3చూసినవారు
బీఆర్ఎస్ సోషల్ మీడియా నడిపేది కేటీఆర్: కవిత
TG: బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారాలపై తీవ్ర వివాదం నెలకొంది. కేటీఆర్ తన ఫొటోలను మార్ఫింగ్ చేయిస్తున్నారని ఆయన సోదరి కవిత ఆరోపించారు. దుబాయ్ కేంద్రంగా సోషల్ మీడియాను నడిపిస్తూ, తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. డబ్బు అహంకారంతో కేటీఆర్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌కు కూడా కూతురు ఉందన్న కనీస జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్