పోలీసుల విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో

3చూసినవారు
పోలీసుల విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఈనెల 7న జరిగిన ఘటనపై సైఫాబాద్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల మేరకు సోమవారం వీరిద్దరూ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు అందులో తమ పాత్రపై పోలీసులు వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్