
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూత
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అస్వస్థత కారణంగా ఈరోజు ఉదయం చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత 30 ఏళ్లలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. రజినీకాంత్ నటించిన 'బాషా' సినిమాతో పాటు, తెలుగులో 'తొలిప్రేమ', 'ప్రేమలేఖ', 'మాస్టర్', 'నాగ' వంటి చిత్రాలకు ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.




