
పాత బ్యాంక్ ఖాతాల కోసం ఆర్బీఐ కొత్త పోర్టల్
ప్రస్తుత కాలంలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండి, వాటిని వాడటం మర్చిపోతుంటారు. ఇలా మూడేళ్లు లావాదేవీలు లేకపోతే ఖాతా ఇనాక్టివ్ అవుతుంది, పదేళ్లు దాటితే డబ్బు ఆర్బీఐకి చేరుతుంది. ఖాతాదారులు తమ పాత లేదా క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తించడానికి ఆర్బీఐ 'ఉద్గం' (UDGAM) పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఖాతాదారులు ఆ వెబ్సైట్లో పేరు, పాన్ వివరాలతో లాగిన్ అయి పాత ఖాతాలను గుర్తించవచ్చు. అనంతరం బ్యాంక్ శాఖకు వెళ్లి కేవైసీ పూర్తి చేసి, వడ్డీతో సహా తమ సొమ్మును తిరిగి పొందవచ్చు.




