AP: కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు, ఇతర వివరాలపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్సై అకాల మృతి పట్ల పోలీసు శాఖతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.