భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ జపాన్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. జపాన్ ఆటగాడు కోకీ వటనబేతో జరిగిన ఫైనల్లో 13-21తో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్నారు. తర్వాతి రెండు గేమ్‌లను 21-18, 21-14తో గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నారు. దీంతో జపాన్ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇటీవల హైలో ఓపెన్ టైటిల్‌ను కూడా లక్ష్య సేన్ గెలుచుకున్నారు.