TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సర్వే కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు 'భూభారతి' సర్వేలో భాగంగా అక్కడి రైతులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు
కేసీఆర్ సహా పలువురు రైతులకు జారీ చేయాల్సిన నోటీసులను మర్కూక్ తహశీల్దార్, రెవెన్యూ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీటిని శుక్రవారం రాత్రివరకు అందజేసే అవకాశం ఉందని సమాచారం.