జమ్మూకశ్మీర్లోని బుద్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ హతమయ్యాడు. పహల్గాం దాడికి ప్రణాళిక రచించిన సులేమాన్కు యాసిర్ సన్నిహితుడిగా గుర్తించారు. పక్కా సమాచారంతో ఆర్మీ, జమ్మూ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సంఘటనా స్థలం నుండి AK-47, భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.