
భార్యతో గొడవపడి నదిలో తోసి చంపిన భర్త!
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. తరచూ గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయిన మయూర్ మెశ్రమ్ అనే వ్యక్తి, తన భార్య నీలాన్ని అక్టోబర్ 21వ తేదీన మోహరా నది వద్దకు తీసుకెళ్లి, ఉద్దేశపూర్వకంగా నీటిలోకి తోసేశాడు. ఈత రాకపోవడంతో ఆమె నీట మునిగి మరణించింది. మృతురాలి బావ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, అక్టోబర్ 22న నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.




