క్వాల్‌కామ్‌ ఉద్యోగులకు లేఆఫ్‌లు

2చూసినవారు
క్వాల్‌కామ్‌ ఉద్యోగులకు లేఆఫ్‌లు
అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌, తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ పనితీరును మెరుగుపరచడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని సీఈఓ క్రిస్టియానో అమోన్ సిబ్బందికి పంపిన మెమోలో తెలిపారు. ఈ లేఆఫ్‌లు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయని సమాచారం. కంపెనీ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్న విభాగాలను సరిదిద్దడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణమని యాజమాన్యం పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితం అవుతారనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్