TG: హైదరాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు చూసి మేధావులు బీజేపీలో చేరుతున్నారని రామచందర్‌రావు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ విదేశాల్లో భారత్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మెటా సంస్థ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరుపార్టీల అవినీతి బయటపెడుతామని రామచందర్‌రావు హెచ్చరించారు.