TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం గన్నేరు ఆకులు కలిసిన పప్పు, అన్నం తిన్న ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. కేంద్రం ఆవరణలోని పోషకాహార తోటలో బచ్చలి, గోంగూర ఆకులను కోస్తున్నప్పుడు స్థానిక మహిళ దార్ల సరోజిని పొరపాటున గన్నేరు ఆకులను కూడా కోసి పప్పులో వండారు. ఈ భోజనం తిన్న పిల్లలు, మహిళలు నీరసపడిపోవడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారు.