
మహారాష్ట్ర రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతుకు రూ.5,000 తక్షణ ఆర్థిక సాయం!
ఎల్నినో కారణంగా వర్షాభావంతో అల్లాడుతున్న మహారాష్ట్ర రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన ప్రతి రైతుకు రూ.5,000 ఆర్థిక సాయాన్ని దీపావళికి ముందే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాలకు గాను.. సుమారు 34 జిల్లాల పరిధిలోని 305 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో పాటు పంట రుణాల రికవరీ నిలిపివేత, విద్యుత్ బిల్లుల రాయితీ, తాగు-సాగు నీటి సౌకర్యాలు, విద్యార్థుల ఫీజుల మాఫీ వంటి చర్యలు కూడా అమలు చేయనున్నారు.




