విమానంపై పడిన పిడుగు.. తప్పిన ప్రమాదం

4చూసినవారు
విమానంపై పడిన పిడుగు.. తప్పిన ప్రమాదం
ఇండిగో విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో పట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E925 విమానంపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఘటన జరిగినప్పుడు ఈ తీవ్రతను పైలట్లు అంచనా వేయలేకపోయారు. అయితే ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా ముందుభాగం డిజైన్ ఉండటంతో ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్