LIVE VIDEO: రూ.25 లక్షల విలువైన 70 ఫోన్లు చోరీ

29చూసినవారు
TG: మహబూబాబాద్‌లో భారీ దొంగతనం జరిగింది. స్థానికంగా ఉన్న సెల్ బే మొబైల్స్ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దొంగలు మంగళవారం అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం షోరూమ్‌లో ఉన్న 70 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగల కోసం దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్