LIVE VIDEO: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్

46చూసినవారు
కేరళలోని అలప్పుజా జిల్లా కలవూరులో నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ జరిగింది. ఫార్మ్ ఫైబర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుస్తున్న మహిళను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కలవూరుకు చెందిన 64 ఏళ్ల సరస్వతియమ్మతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్