ఎల్‌కే అద్వానీకి అస్వస్థత

8చూసినవారు
ఎల్‌కే అద్వానీకి అస్వస్థత
బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో ఇబ్బందిపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 98 ఏళ్ల అద్వానీ కొన్నేళ్లుగా వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది మేలో అపోలో ఆస్పత్రిలో చేరి, కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు.

సంబంధిత పోస్ట్