బురదలో చిక్కుకున్న కూరగాయల లారీని బయటకు లాగిన స్థానికులు

0చూసినవారు
కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ ఒకటి అనుకోకుండా రోడ్డు పక్కన ఉన్న గడ్డి, బురదలో ఇరుక్కుపోయింది. కూరగాయలు పాడైపోతాయని డ్రైవర్ తీవ్ర ఆందోళన చెందాడు. ఈ పరిస్థితిని గమనించిన సుమారు 300 మంది స్థానికులు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందరూ కలిసి ఐక్యతతో శ్రమించి, బురదలో చిక్కుకున్న లారీని సురక్షితంగా రోడ్డుపైకి తీసుకువచ్చారు. స్థానికుల ఈ సమయస్ఫూర్తి వల్ల డ్రైవర్‌కు జరగబోయే భారీ నష్టం తప్పింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ, నెట్టింట మాత్రం వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్