ఢీకొట్టుకున్న లారీలు.. ముగ్గురు స్పాట్ డెడ్ (వీడియో)

76చూసినవారు
AP: పల్నాడు జిల్లాలోని గామాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న డీసీఎం లారీని మట్టి లోడుతో వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. అదే సమయంలో తెలంగాణ వైపు నుంచి వస్తున్న కంటైనర్ అదుపుతప్పి డివైడర్ దాటి డీసీఎం లారీపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు, మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్