కారుపై పడిన లారీ.. ముగ్గురు స్పాట్‌డెడ్

17చూసినవారు
పంజాబ్‌లోని రోపార్-మనాలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ  ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే నుజ్జు నుజ్జు అయి మృతి చెందారు. ఇసుక, కంకరతో నిండిన ఒక టిప్పర్ ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. తరచుగా రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా తిరుగుతున్న ఇలాంటి ట్రక్కులు, ముఖ్యంగా అక్రమ ఇసుక తవ్వకాల కోసం వినియోగించే వాహనాలు పంజాబ్ రహదారులపై నిత్యం ప్రమాదాలకు కారణమవుతూ ప్రజలకు పెద్ద శాపంగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్