TG: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాద స్థలంలో అగ్గు సౌందర్య(35), చింతకుంట లక్ష్మి (25) మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనియా, సుమలత తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి వివేక్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేలు అందజేశారు. గాయపడిన వారికి రూ.10 వేలు తక్షణ సాయం ప్రకటించారు.