TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బాలాజీనగర్ టౌన్‌షిప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాత జాతీయ రహదారిపై ఉద్యోగులను ఎక్కించుకుంటున్న ఎంఎస్‌ఎన్ ఫార్మా బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఫార్మా ఉద్యోగులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.