సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ వ్యానును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

6చూసినవారు
సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ వ్యానును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
TG: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర వద్ద అడవిలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. 39 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ వ్యానును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హన్మకొండ నుంచి ఇసుక కోసం వెళ్తున్న లారీ.. జాతీయ రహదారిపై CRPF జవాన్ వెళ్తున్న వాహనంతో పాటు మరో కారును ఢీకొట్టింది. దీంతో జవాన్ చనిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్