TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన లారీ ఒక బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో బొలెరో వాహనం అదుపుతప్పి ఓ బైక్, మరో కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.