ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికి గాయాలు

32చూసినవారు
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికి గాయాలు
AP: ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి హైస్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్