బిహార్‌లోని బార్హ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ స్కార్పియో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.