AP: కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గురువారం తునిలో వివాహ వేడుక ముగించుకుని కాకినాడ జిల్లా ఉప్పాడకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారందరినీ తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఉప్పాడకు చెందినవారుగా గుర్తించారు. బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులు బయటపడ్డారు.