మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

8చూసినవారు
మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
లారీ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టు వద్ద పూలు కోస్తున్న ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా ఖడబాగ మెయిన్ రోడ్డుపై శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో అహల్య గౌడ (55) అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్