ప్రేమ వివాహం చేసుకుందని.. బతికి ఉన్న కూతురికి అంత్యక్రియలు

30చూసినవారు
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని బతికి ఉన్న కూతురికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా జావురాలో జరిగింది. మోనా ప్రజాపత్ అనే యువతికి డిసెంబర్ 3వ తేదీన ఓ వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఆ పెళ్లి ఇష్టం లేని యువతి ప్రియుడు దీపక్ ధాకడ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, ఆమె చనిపోయిందంటూ ప్రకటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 250 మంది హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్