TG: ఖైరతాబాద్ బడా గణేశ్ (పంచముఖ సంకటహర మహాగణపతి) దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బుధవారం రాత్రి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, వందలాది మహిళలు భక్తిశ్రద్ధలతో మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు దీప ప్రమిదలను చేతిలో ఉంచి బడా గణేశ్కి మహా హారతి ఇచ్చారు. సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది.