
మరో మూడ్రోజుల్లో పీఎఫ్ డబ్బులు జమ?
సెప్టెంబర్ నెలకు సంబంధించిన పీఎఫ్ డబ్బులు ఇంకా ఖాతాలో జమ కాలేదని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు శుభవార్త. మరో మూడ్రోజుల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. కంపెనీలకు ఈపీఎఫ్వో కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్లను ఈ నెల 15వ తేదీలోపు జమ చేయాలని, అక్టోబర్ 15లోగా ECRను ఫైల్ చేసి చెల్లింపులు పూర్తి చేయాలని యజమానులకు సూచించింది.



































