Sep 16, 2026, 13:09 IST/
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?: హరీష్ రావు (వీడియో)
Sep 16, 2026, 13:09 IST
TG: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ధరణి పోర్టల్పై మరోసారి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ధరణిలో జరిగిన అవకతవకలపై, కాంగ్రెస్ హయాంలో భూ భారతిలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధమని ఆయన అన్నారు. దమ్ముంటే ఈ విచారణకు ముందుకు రావాలని, అలాగే తమ ఆస్తులు, కాంగ్రెస్ నాయకుల ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని హరీశ్ రావు సవాల్ విసిరారు.