Sep 22, 2026, 10:09 IST/
వినాయక నిమజ్జనానికి స్పెషల్ MMTS రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
Sep 22, 2026, 10:09 IST
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ప్రజల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక MMTS రైళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 25 నుండి 27 వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, ఫలక్నుమాలను కలిపే మార్గాల్లో నడిచే ఈ రైళ్లు అన్ని స్టేషన్లలో ఆగుతాయి. రద్దీని తగ్గించి, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడమే ఈ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.