
దేవరకద్రలో బ్రహ్మోస్ క్షిపణి కర్మాగారం: మహ్మద్ సాదిక్
దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ క్షిపణి కర్మాగారం ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాదిక్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీఎంఆర్ కృషితో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు 400 ఎకరాల భూమి అవసరమని పేర్కొన్నారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.



























