Oct 15, 2026, 13:10 IST/
వారణాసిలో బాణాసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
Oct 15, 2026, 13:10 IST
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో, సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగ్ తలాబ్ ప్రాంతంలో ఉన్న బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా కూలిపోగా, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం, గాయపడిన వారి సంఖ్య, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.