
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని నర్సింగ్ తాండా గ్రామపంచాయతీ పరిధిలోని దేవుల తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.























