
యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయ పరిధి గల పీజీ కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాంప్రదాయ పాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి. ఎన్. శ్రీనివాస్ మరియు రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేశ్బాబు పాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఇతర సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


























