Sep 13, 2026, 07:09 IST/
పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
Sep 13, 2026, 07:09 IST
సురక్షిత పెట్టుబడితో స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.4% వార్షిక వడ్డీ, 5 ఏళ్ల మెచ్యూరిటీ ఉంది. రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. 7.4% వడ్డీ ప్రకారం రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.9,250 వడ్డీ లభిస్తుంది.