
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. కాట్రేవుపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ పని నిమిత్తం మక్తల్ వచ్చి తిరిగి వెళుతుండగా ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆనంద్ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిస్థానంతరం జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాదుకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.





































