Oct 11, 2026, 02:10 IST/
బతికుండగానే చనిపోయినట్లు రికార్డులు.. పింఛను నిలిపివేసిన అధికారులు
Oct 11, 2026, 02:10 IST
ఒడిశా రాష్ట్రం సంబల్పూర్కు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు బేలమతి భుయాన్ జీవనాధారమైన వృద్ధాప్య పింఛను నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆమె చనిపోయినట్లు పురపాలక అధికారులు రికార్డుల్లో తప్పుగా నమోదు చేసి పింఛను ఆపేశారు. కోలుకుని పింఛను కోసం వెళ్లగా విషయం తెలిసి అవాక్కయింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారని, రేషన్ సరకులు, పింఛనుతోనే జీవనం సాగిస్తున్న తమకు కష్టాలు రెట్టింపయ్యాయని ఆమె వాపోయింది.