
పెళ్లైన నెల రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు భార్య యత్నం
వనపర్తిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన నెలకే భర్తను ప్రియుడితో కలిసి చంపేందుకు యత్నించింది ఓ నవవధువు. బ్రహ్మంగారి వీధికి చెందిన షబ్బీర్ కు నాగర్ కర్నూలు జిల్లా మమ్మాయిపల్లికి చెందిన షాహిదా బేగంతో నెల కిందట పెళ్లయింది. ఆమె హైదరాబాద్ లో బి. టెక్ చదువుతున్న తన ప్రియుడు షాకీర్ తో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ వేసింది. గురువారం అర్ధరాత్రి షాకీర్ ఇంట్లోకి వచ్చి ప్రియురాలి భర్త ముఖంపై బొద్దింకల స్ప్రే కొట్టి, బెల్టుతో గొంతు నొక్కాడు. భార్య చేతులు పట్టుకుంది. బాధితుడి కేకలతో అతని అన్న లేవడంతో నిందితుడు పరారయ్యాడు. అతనితో వచ్చిన స్నేహితుడితో పాటు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.



















