
అక్టోబర్ 16 నుంచి 18 వరకు విజయవాడలో పర్యటించనున్న చైనా రాయబారి
AP: అక్టోబర్ 16 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే ఉత్సవాలకు చైనా రాయబారి జు ఫీహోంగ్ తన సతీమణి టాన్ యుక్సియుతో కలిసి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబుకి చైనా రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయి భారత్-చైనా మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం పెంపుపై చర్చించనున్నారు.




