
వైద్యుల ప్రకటనలపై ఎన్ఎంసీ కఠిన ఆంక్షలు
వైద్య రంగంలో పెరుగుతున్న వ్యాపార ప్రకటనలు, ప్రచారాలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రోగుల ఫోటోలు/వీడియోలు, రివ్యూలు, ఏఐ డీప్‌ఫేక్స్, పెయిడ్ ప్రమోషన్లు, "100% గ్యారంటీ" వంటి క్లెయిమ్‌లను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యుల లైసెన్స్‌ను 3 నెలల నుంచి 3 ఏళ్ల వరకు సస్పెండ్ చేస్తామని ఎన్ఎంసీ హెచ్చరించింది. ఈ చర్యలు వైద్య వృత్తిలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో చేపట్టారు.




