మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రధాన రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్శిల్ విభాగానికి సమీపంలో ఉన్న ఒక ఫుడ్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఫుడ్ స్టాల్‌లోని సామాగ్రి కాలిపోవడంతో పాటు ప్లాట్‌ఫారమ్ పైకప్పుకు కొంత నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ధృవీకరించారు.