యూపీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫిరోజాబాద్‌లోని టైర్ల కంపెనీలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.