ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి

76చూసినవారు
ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 20 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని సుదీర్ఘ శ్రమ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్