TG: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పరిధిలో గల నయాన్ ఇన్‌ఫ్రా అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 4వ అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్లలో దేవుడి గదిలో వెలిగించిన దీపం నుండి మంటలు వ్యాపించి.. గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెషర్లు పేలాయని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, సీలింగ్ తగలబడి దాదాపు రూ. 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.