మలేరియా వ్యాక్సిన్‌ ధర 40 శాతం తగ్గింపు

34చూసినవారు
మలేరియా వ్యాక్సిన్‌ ధర 40 శాతం తగ్గింపు
మలేరియా వ్యాక్సిన్‌ ‘మాస్కివాక్‌’ ధరను దాదాపు 40 శాతం తగ్గిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. గావి, యూనిసెఫ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో డోసు ధర 5.50 యూరోలకు (సుమారు రూ.585) తగ్గనుంది. ఈ ధర 2027 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. 2027–2029 మధ్య అంతర్జాతీయ టీకా కార్యక్రమాలకు సుమారు 50 మిలియన్‌ డాలర్లు ఆదా కానుండగా, అదనంగా 10 లక్షల మంది చిన్నారులకు నాలుగు డోసుల టీకా అందనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్