
అర్నబ్ అలర్ట్.. ఏపీతో సహా మూడు రాష్ట్రాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' అతి తీవ్ర తుపాను గంటకు 18 కిమీ వేగంతో ఏపీ తీరం వైపు పయనిస్తోంది. ఇది బుధవారం నాడు యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విశాఖకు 170 కిమీ, కాకినాడకు 140 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. బాపట్ల, విశాఖ సహా ఏపీలోని 15 జిల్లాల్లో బుధవారం సాయంత్రంలోపు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా ముప్పు పొంచి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.




