
మణిపూర్లో మళ్లీ హింస.. ఐదుగురు మృతి
బీజేపీ పాలిత మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. కామ్జోంగ్, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. చస్సాద్లో 10 ఇళ్లు, 20 షాపులు దగ్ధమయ్యాయి. నాగా, కుకీ-జో తెగల మధ్య హింస చెలరేగడంతో ఈ మరణాలు సంభవించాయి. కామ్జాంగ్ జిల్లాలోని నింగ్చౌ గ్రామంలో ఇద్దరు నాగా గ్రామస్థులను కాల్చి చంపారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. 'కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ' బంద్కు పిలుపునిచ్చింది.




